Tuesday, March 31, 2026

కచ్చా లే అవుట్ ప్లాట్ లను ఎవరు కొనుగోలు చేయవద్దు

  • మార్చి 31 చివరి నాటికి 25 శాతం రాయితీ తో ఎల్.ఆర్.ఎస్ చేయించుకొండి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఎల్. ఆర్.ఎస్ లేని వారు మార్చి 31 తర్వాత ఇల్లు కట్టుకోవాలను కుంటే ఎలాంటి రాయితీ లేకుండా ప్రస్తుత మార్కెట్ వాల్యూ కు 14 శాతం పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.కచ్చా లే అవుట్లు, ఎల్.ఆర్.ఎస్. చేసుకొలేని ప్లాట్ల పై చర్యలు తీసుకోండి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించిన – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 2020 తర్వాత కచ్చా లేఔట్ చేసిన వారు, వాటిలో ప్లాట్ లు తీసుకున్నవారు జిల్లాలో 29 వేల మంది ఎల్.ఆర్.ఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, వారి నుండి డబ్బులు వసూలు చేసి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఎల్.ఆర్.ఎస్ లే అవుట్ లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పై మంగళవారం ఉదయం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, లైసెన్స్డ్ టౌన్ ప్లానర్ లు, టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ ఎల్.ఆర్. ఎస్ పురోగతి పై సమీక్ష నిర్వహించారు.ఇప్పటికే జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల ద్వారా దాదాపు 25 వేల మందికి నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో క్రమబద్ధీకరణ జరగటం లేదని ప్రశ్నించారు.లే అవుట్ లు చేసిన వారు, ఓనర్లు, రైటర్ లు, బిల్డర్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో వార్డు ఆఫీసర్ల ద్వారా ఫోన్ చేయించి డబ్బులు కట్టించే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ చేయించుకోకుంటే రేపటినాడు ఎప్పుడైనా ఎల్.ఆర్.ఎస్ ఆమోదం లేని ప్లాటు పై ఇల్లు కట్టుకోవాలంటే అప్పటి ప్లాట్ వాల్యూ పై ప్రో రేటా ఫీజు తో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని అదేవిధంగా లే అవుట్లు, ప్లాట్ల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మార్చి 31 నాటికి కచ్చా లే అవుట్ లు, ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికిని చివరి నిమిషంలో సర్వర్ పనిచేయకుంటే లబ్ధిదారులు నష్టపోతారని అందువల్ల వెంటనే డబ్బులు కట్టి క్రనబద్ధికరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎల్.ఆర్.ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎట్టి పరిస్థితిలోనూ ఎల్.ఆర్.ఎస్ లేని ప్లాట్లను ప్రజలు లోగోలు చేయవద్దని జిల్లా ప్రజలను సూచించారు.ఎల్.ఆర్.ఎస్ ఉంటే ప్లాటుకు రక్షణ ఉంటుందని, ఎవరు అక్రమించుకోడానికి అవకాశం ఉండదని అదేవిధంగా లే అవుట్ ప్లాట్ల ప్రాంతాన్ని మున్సిపాలిటీ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ప్లాటు అమ్ముకోవాలనుకున్న ఎల్.ఆర్ ఎస్ ఉన్న ప్లాటు కు మంచి డిమాండు ఉంటుందని తెలియజేశారు. ఎల్.ఆర్.ఎస్. కు డబ్బులు కట్టిన ప్లాటు యజమానులకు కలక్టర్ క్రమబద్ధీకరణ ఉత్తర్వు కాపీలను అందజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లు, లైసెన్స్డ్ లేఔట్ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News