- కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెడ్ హెల్త్ ప్రొఫెషనల్ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : రేవెల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరశురాం కుమారున్ని అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెడ్ హెల్త్ ప్రొఫెషనల్ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హైదరాబాదులో నైస్ హాస్పిటల్ లో పరామర్శించారు. బాలునికి అనారోగ్యం నుంచి కోలుకుంటావని ధైర్యంగా ఉండాలని ఆదిత్య మనోధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి బాలుని ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలునికి మెరుగైన వైద్యం ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు.



