Tuesday, March 31, 2026

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వచ్చేంత వరకు ఉద్యోగ ఫలితాలు నిలిపి వేయాలి

  • వడ్లూరి పర్శరాములు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు

నేటి సాక్షి, బెజ్జంకి: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వచ్చేంత వరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను ప్రభుత్వం నిలిపివేయాలని మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో వడ్లూరి పర్శరాములు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి, ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ రిజర్వేషన్ అమలు చేయాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రరూపంలో కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి బోనగం రాజేశం సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే వర్గీకరణ అమలు చేసి, ఉద్యోగాల భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు కూలి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, కల్లెపల్లి విశ్రాంత ఉద్యోగి రోళ్ల రాములు సంఘీభావం తెలిపారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి చింతకింది పర్శరాములు,సలహాదారులు తాడిచెట్టు భూమయ్య, ప్రధాన కార్యదర్శి మోదుంపల్లి రాజు, ఉపాధ్యక్షులు చింతకింది ఎల్లయ్య, బోనగిరి ప్రభాకర్, మల్లేశం, టౌన్ అధ్యక్షులు బోనగిరి చంద్రయ్య, సీనియర్ నాయకులు నంగునూరి అంజయ్య, కొంపెల్లి రాజు,బోనగిరి ఎల్లయ్య, పొత్తురి మల్లేశం, మంకాల రాజయ్య, భూపేందర్, రాజయ్య, మిద్దె శంకర్, పొట్లపెల్లి దుర్గయ్య, లక్ష్మిపూర్ గ్రామ మహిళలు, ముత్తన్నపేట, క్రాసింగ్, గుగ్గిళ్ల గ్రామ శాఖల అధ్యక్షులు పొత్తురి అంజి, కనగండ్ల తిరుపతి, సోము లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News