Tuesday, March 31, 2026

ట్రేడ్ మెన్స్ లకు సూటబుల్ జాబ్ ఒప్పందం హర్షణీయం

నేటి సాక్షి, మందమర్రి:- సింగరేణిలో మైనింగ్ సూపర్వైజర్ల మాదిరిగా ట్రేడ్ మెన్స్ లకు సైతం మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ అయితే సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చుటకు ఒప్పందం కుదుర్చుకోవడం హర్షనీయమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ట్రేడ్ మెన్స్ నాయకులు టేకుమట్ల తిరుపతి తెలిపారు. మంగళవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ట్రేడ్ మెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, గత శుక్రవారం సింగరేణి సిఎండి బలరాం తో గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ నాయకుల మధ్య జరిగిన సీఎండి స్థాయి స్ట్రక్చరల్ కమిటీ సమావేశంలో ట్రేడ్ మెన్స్ లకు సైతం సూపర్వైజర్ లాగా సూటబుల్ జాబ్ ఇచ్చుటకు అంగీకరించారని తెలిపారు. దీనికి కృషిచేసిన సిపిఐ కొత్తగూడెం శాసనసభ్యులు, యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు కు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లకు ట్రేడ్ మెన్స్ ల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ మెన్స్ నాయకులు ఎన్ రాజ్ కుమార్, భాస్కర్, కే. వేణు, జి రాజశేఖర్, ఎండి ముస్తాఫ్ అలీ, జగన్మోహన్, ఎస్ శ్రీనివాస్, లెక్కల రాజేష్, రాజేష్, కిరణ్, ఎస్ అనిల్, ఎస్ మహేష్, అన్వేష్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News