Tuesday, March 31, 2026

ఉదారతను చాటుకున్న పూర్వ విద్యార్థులు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : మానవసేవే.. మాధవ సేవ.. జోగులాంబ గద్వాల జిల్లా బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసినా, సమాచారం అందించిన సమాచారం తెలుసుకున్న వెనువెంటనే తను సొంతంగా ఏర్పాటు చేసుకున్న మానవసేవే మాధవసేవ గ్రూప్ నుంచి మరియు సోషల్ మీడియా తరపున ఆపద వచ్చిన ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని తెలియపరుస్తూ జిల్లాలో ఉన్న ఎవరికి ఏ ఇబ్బంది కలిగిన ఈ గ్రూపులో తమ కష్టాలను, ఇబ్బందులను తెలియపరిస్తే వెంటనే స్పందిస్తూ తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ రావడం జరుగుతుందని దాతల సహకారంతో ఆయా కుటుంబాలకు ఏర్పడిన ఇబ్బందులను తీర్చుటకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటికే దాదాపుగా 10 కుటుంబాలను హక్కున చేర్చుకొని వారికి దాతలు అందించినటువంటి ఆర్థిక సహాయం అందిస్తూ.. వారిలో మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు వెళుతున్నానని ఇదే సందర్భంలో జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లు మండలం, చర్ల గార్లపాడు గ్రామానికి చెందిన ఒక మహిళ ఆర్టిక ఇబ్బందుల కారణంగా అకాల మరణం చెందడం, పిల్లల తండ్రి మానసిక ఒత్తిడికి లోనై ధైర్యం చెప్పేవారు లేక ఇతరులను సహాయము కోరలేక పురుగుల మందు తాగి తేది 28:02:2025 న పురుగుల మందు సేవించి చనిపోవడం జరిగింది. దీంతో వారికి ఉన్న ముగ్గురు పిల్లలు దిక్కుతోచనే పరిస్థితిలో అనాధలుగా మిగిలిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డి ఆర్ కె న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తనవంతుగా సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకునీ దీంతో తను ఏర్పాటు చేసుకున్న గ్రూపులో ఈ విషయాన్ని తెలియపరి, ఇందుకు దాతలు కూడా తమవంతుగా సహకారం అందించారు. దాతల సహకారంతో మూడు నెలల కు సరిపడ నిత్యవసర వస్తువులు..అలాగే 15,500 రూపాయలు దాతల సహకారంతో అందించిన ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందించడం జరిగిందన్నారు. దాతలు అందించిన ఇంటికి సరిపడా సరుకులు దాతలు అందించిన ఆర్థిక సహాయాన్ని మంగళవారం రోజు ఉదయం మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామంలోని వారి స్వగృహం దగ్గర పెద్దల సమక్షంలో కుటుంబానికి అందించడం జరిగిందని డి ఆర్ కె న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రిపోర్టర్ రామాంజనేయులు తో పాటు మల్దకల్ మండలం ఆంధ్రప్రభ రిపోర్టర్ దామ లక్ష్మీనారాయణ, ఆర్థిక సహాయం అందించిన దాత ఫోటోగ్రాఫర్ శేఖర్, బాల రంగడు తదితరులు ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకున్న పూర్వపు విద్యార్థులు తల్లిదండ్రులు చనిపోవడంతో అనాధలుగా మిగిలిన ముగ్గురు చిన్నారులను మల్దకల్ మండల కేంద్రానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ దామ లక్ష్మీనారాయణ పూర్వపు విద్యార్థుల అందరి సహాయ సహకారంతో 48,000/- రూపాయలను ఆ కుటుంబానికి అందించినట్లు మల్దకల్ ఆంధ్రప్రభ రిపోర్టర్ ధామ లక్ష్మీనారాయణ మానవసేవయే మాధవసేవ గ్రూప్ ద్వారా తెలియపరచడం జరిగింది. అనాధలుగా మిగిలిన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పూర్వ విద్యార్థులకు బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News