- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్న నరేంద్ర మోడీ పేదవారిని మరింత దిగదార్చి కార్పొరేట్లకు భజన చేస్తున్న మోడీ బండారాన్ని ప్రజలు గుర్తించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం నాడు తుక్కుగూడ లక్ష్మీ గార్డెన్ లో జరిగిన సిపిఐ జిల్లా స్థాయి సెమినార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేద వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిందని కానీ కార్పొరేట్ల సంపద 100 రెట్లు పెరిగిందని ఇది ఏమి మాయ నరేంద్ర మోడీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. పన్నుల విధానాన్ని మార్చి జిఎస్టి పేరుతోటి పేదల మీద 97% పన్నులు వసూలు చేస్తూ వసూలు చేసిన డబ్బులను కార్పొరేట్లకు మేపుతున్నాడని ఆయన విమర్శించారు. దేశంలో ఖనిజ సంపద ప్రకృతి సంపదలను కార్పొరేట్లు యవేచ్ఛగా దోచుకుపోతున్న నరేంద్ర మోడీ వారికి మరింత దోచుకునే అవకాశాలు కల్పించడం బాధాకరమని ఆయన మండిపడ్డారు. ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక వాదుల మీద కవులు కళాకారుల మీద దాడులు హత్యలు జరుగుతున్నాయని, ఇది ముమ్మాటికీ కార్పొరేట్ల ప్రభుత్వమని ఆయన అన్నారు.ప్రజలు తిరుగుబాటు చేస్తేనే ప్రభుత్వాలు రాజ్యాలు మారతాయని శ్రామిక రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి ప్రతి కమ్యూనిస్టు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ సైకాలజిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మానసిక దృఢత్వంతో మంచి ఆలోచనలు మంచి వ్యక్తిత్వం కలిగిన వారు దేనినైనా విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టుల త్యాగాలు చాలా గొప్పవి వాటిని ప్రజలకు అందే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్ కార్యక్రమానికి అధ్యక్షునిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు, పానుగంటి పర్వతాలు, ముత్యాల యాదిరెడ్డి, కే. రామస్వామి, మహేశ్వరం నియోజకవర్గం బి. దత్తు నాయక్, కావలి నరసింహ ఓరుగంటి యాదయ్య పై మీద జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి టి. రామకృష్ణ, ఎం. ప్రబలింగం, బీ. జంగయ్య బాతరాజు నరసింహ, పబ్బతి లక్ష్మణ్ ఎం. శ్రీను, ఆర్ యాదగిరి, నీలమ్మ, బాలాపూర్ మండల కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పల్నాటి యాదయ్య, కె. రాజు, దేవేంద్ర గౌడ్ బ్రహ్మచారి, ఎన్. యాదగిరి, తదితరులు పాల్గొన్నారు



