Tuesday, March 31, 2026

వాహనాల తనిఖీ

నేటి సాక్షి, వేమనపల్లి : నీల్వాయి అటవీ సమీపంలో మంగళవారం ఎస్‌ఐ శ్యాం పటేల్ తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వాహనదారులతో మాట్లాడుతూ.. రామగుండం సిపి ఆదేశానుసారం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని దానికి వాహనదారుల సహకరించాలని అన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, కారు నడిపేవారు సీట్‌ బెల్ట్‌ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించి తీసుకోవాలని ట్రాఫిక్‌ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News