నేటిసాక్షి /వాజేడు : మండల పరిధిలోని చెరుకూరు, ధర్మారం, జగన్నాధపురం మండపాక గ్రామాలలో 163వ జాతీయ రహదారికి ఇరువైపుల రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకొని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిరియాని హౌస్ హోటల్స్ టిఫిన్ సెంటర్స్ అని పేర్లు పెట్టుకుని. అతి తక్కువ రేటు గల వంట నూనెను వాడుతూ ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచిన చట్నీలు, కూరలు పిండి పదార్థాలు మాంసాహారం ని వండుతూ స్వేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. మరి ఇంత జరుగుతున్నా జిల్లా ఆహార భద్రత అధికారి నిమ్మకు నీరెత్తనట్లు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? వాజేడు మండలంలో ఈ సారు తనిఖీలు నిర్వహించరా? పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే ఎందుకని చలణం లేకుండా ఉంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు బాధ్యతలు గుర్తుకు వచ్చి మండల ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.



