- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబ శివరావు వరంగల్ తన బృందం చే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సంభవించిన మాతృ మరణము ల గురించి తెలుసుకొని వారి పైన చట్ట రీత్యా చర్యలు తీసుకోవడానికి ఒక ఎక్స్పోర్ట్ కమిటీని నియమిస్తున్నామని తెలిపినారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. అదేవిధంగా ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ అపోలో ఎన్ ఎస్ ఆర్ వైస్ హాస్పిటల్ లలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగినది. అనంతరం మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. క్లినిక్కులు, పోలీ క్లినిక్కు లు, హాస్పిటల్స్ నడిపే వారు తప్పని సరిగా నియమ నిబంధనలు పాటించాలని కోరారు. జిల్లాలోని అన్ని క్లినిక్కు లు, పోలీ క్లినిక్కులు, ల్యాబ్ లు, హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్లు, ఫీజియో థెరఫీ సెంటర్లు, నేత్ర క్లినిక్కు లు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలాగే జిల్లాలోని ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, యోగ, నేచురోపతి వంటి అన్ని హాస్పిటల్స్, క్లినిక్కు లు కూడా తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించు కోవాలని లేనిచో పెనాలిటీ, సీస్ చేయటము మరియు అటువంటి క్లినిక్కు లు, ఆసుపత్రుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును అని తెలిపారు. ఆర్ఎంపి, పిఎంపి వైద్యులు పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోకూడదని వారి కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలనీ ఇంజెక్షన్లు, సెలైన్ లు పెట్ట రాదని అల్లోపతీ వైద్యం చేయరాదని వారి దగ్గర మందుల నిల్వ ఉంచు కోరాదని అయన తెలిపారు. ప్రతి వైద్యుడు కూడా “ప్రిస్క్రిప్షన్ క్లియర్గా” మాత్రమే వ్రాయాలని కోరారు. ప్రతి క్లినిక్, పోలీక్లినిక్, నర్సింగ్ హోమ్, హాస్పిటల్స్ మరియు ఆయుష్ క్లినికల్, పోలీ క్లినిక్ ఆసుపత్రుల వారు వారి వారి సెంటర్లలో వసూలు చేయి ఫీజుల వివరములు తప్పని సరిగా తెలుగు, ఇంగ్లీష్ భాషలో రిసెప్షన్ నందు బోర్డులు ఏర్పాటు చేయాలనీ, ఆ ప్రకారమే రోగుల నుండి చార్జీలు వసూలు చేయాలనీ, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరిశుభ్రత, సౌకర్యాలు అందించే విషయంలో ప్రమాణాలు తప్పని సరిగా పాటించాలని వారి, వారి ఇంస్టిట్యూట్స్లో పని చేసే వైద్యులు వారి రిజిస్ట్రేషన్ నంబర్లు, వారి వారి విద్యార్హతలు కూడా రిసెప్షన్ వద్ద ప్రదర్శించాలని కోరారు. ప్రతి హాస్పిటల్, నర్సింగ్ హోమ్ వారు నిర్ణయించుకున్న రేట్స్ (రాక్ రేట్లను) ప్రతి సంవత్సరం జూన్ నెల మొదటి వారంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం లో అంద చేయాలని లేనిచో కఠిన చర్యలు తీసుకోనున్నట్టు అయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సిజేరియన్ ఎక్కువగా ఉంది కాబట్టి తప్పని సరిగా ఇండికేషన్ ఉన్న కేసులకు మాత్రమే సి-సెక్షన్ కాన్పులు చేయాలి. అనవసరంగా ఇండికేషన కాకుండా సి-సెక్షన్ కాన్పులు చేస్తే వైద్య అధికారులు కేసు ఆడిట్ చేసి అనవసరంగా సి సెక్షన్ చేసిన హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటారు మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు రాసి సదరు వైద్యుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంపీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే నిబంధనలకు లోబడి ఇద్దరు డాక్టర్ల సమక్షంలో అబార్షన్స్ చేయాలనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు అబార్షన్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నెల చేసిన అబార్షన్స్ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో అందించాలని కోరారు. గైనకాలజిస్టులు ఏ ఆర్టి సరోగసి లెవెల్ వన్ లెవల్ టు, రిజిస్ట్రేషన్లు కలిగిఉన్న వారు మాత్రమే ఐ వి ఎఫ్ సెంటర్లు నడుపు కోవడానికి అర్హులని తెలిపినారు అర్హులు మా ప్రత్యేక తనికీ బృందాలు లోపాలను గుర్తించి నట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు వచ్చిన జబ్బుల గురుంచి పేషెంట్ల కు తప్పని సరిగా వారికీ అర్ధమయ్యే భాషలో వివరించాలని, జబ్బుకు అయ్యే ఖర్చులని కూడా ముందుగానే వివరించాలని, రోగుల హక్కులు, బాధ్యతలు ప్రతి ఆసుపత్రలో తెలిపే విదంగా బోర్డులను ఏర్పాటు చేయాలనీ కోరారు. జిల్లాలో తనికీ బృందాలు నిరంతరం క్లినిక్కు లు, ఆస్పత్రులు, తనికీ చేస్తుంటాయని, తనికీ అధికారులు అడిగిన వెంటనే అన్ని రకాల అనుమతులకు సంబందించిన సర్టిఫికెట్లు, సిబ్బంది వివరములు చూపించ వలెనని కోరారు. ఎవరైనా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పి సి పి ఎన్ డి టి ఆక్ట్ లకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారి పైన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపినారు. ఈ కార్య క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబ శివరావు ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన డిప్యూటీ అనిల్ కుమార్, మనోజ, ఎల్ డి కంప్యూటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



