Tuesday, March 31, 2026

మహేశ్వరం ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నడికుడ శివ ఆహ్వానం మేరకు కేఎల్ఆర్ ఆతిథ్య స్వీకారం

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): మహేశ్వరం నియోజకవర్గం ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు నడికుడ శివ ఆహ్వానం మేరకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నివాసానికి విచ్చేసి భోజనం స్వీకరించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నడికుడ శివ మాట్లాడుతూ, కేఎల్ఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు అని ప్రశంసించారు. సహృదయ ఆతిథ్యానికి నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాష్కర్ రెడ్డి, నందిగామ నర్సింహ్మ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్, మహేశ్వరం మండలం మాజీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు రాజ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు, సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్ అమీర్‌పెట్, నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని స్వాగతం సుస్వాగతం తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News