- మౌలిక వసతుల కల్పనకు కృషి
- ములుగులో పర్యటించిన గవర్నర్ జిష్ణు దేవ్
- సమ్మక్క-సారలమ్మలకు పూజలు
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : శ్రీ సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంగళవారం మేడారం సమ్మక్క – సారలమ్మ కు మొక్కులు చెల్లించి, నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవారికి పత్యేక పూజలు చేశారు. మంత్రి సీతక్క, శ్రీ సమ్మక్క సారలమ్మ ల ప్రాశస్త్యం గురించీ గవర్నర్ కీ వివరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని, గ్రామం తనను ఎంతగానో ప్రభావిత చేసిందన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వాతావరణం అంతర్గత రోడ్లు నిర్మాణం అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తా మన్నారు. అయన వెంట రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ దివాకర టీఎస్, ఏటూరు నాగారం, ఐటీడీఏ పీఓ. చిత్ర మిశ్రా, ఎస్పీ శబరిష్, తది తరులున్నారు.



