- యవత పోరును విజయవంతం చేయండి..
- పేట పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి..
- మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఫీజు పోరుకు సన్నద్ధం కావాలని నెల్లూరు జిల్లా కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ శాసన సభ్యలు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నిర్వహించే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “యువత పోరు” ను జయప్రదం చేయాలని పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్,పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎంఎల్ఏ సంజీవయ్య క్యాంప్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం బయలుదేరి
విద్యార్థులు,నిరుద్యోగులకు అండగా నిలుస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు కార్యక్రమంలో నాయుడుపేట పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, యువకులు, కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు తెలియజేశారు.



