Tuesday, March 31, 2026

ఎండిన పంటలకు నష్టపరిహామైన ఇవ్వండి

  • యువజన నాయకుడు నిమ్మ నిఖిల్ రెడ్డి

నేటిసాక్షి చేర్యాల: పంటలకు సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాని రూ.20 వేల చొప్పున పంట నష్టపరిహారం రైతులకు అందించాలని యువజన నాయకులు నిమ్మ నిఖిల్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎండిపోయిన పంట పొలాల రైతంగానికి నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వర్ష కాలంలో పంటలు సాగు చేసిన రైతులకు యాసంగి పంటకు అవసరమైన సాగునీరు అందిస్తామని ప్రకటనలు చేశారని, ఇక నీళ్లు వస్తాయని ప్రచారం చేయడంతో రైతులు గంపెడంత ఆశతో పంటలు సాగుచేసుకున్నారని అన్నారు. తీరా సమయానికి ఒక్క చుక్క నీళ్ల అందించడం లేదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీటి పర్వతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ఇబ్బందులు ఉండవని చెప్పిన నాయకులు ఇప్పుడు యాసంగికి నీళ్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంతంతమాత్రంగానే ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News