Tuesday, March 31, 2026

ఉపాధి పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి వసతి కల్పించాలి

  • ఎంపిడిఓ కుమార స్వామి

నేటి సాక్షి, వేమనపల్లి : ఎండలు మండుతున్నందున గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రదేశాల్లో కూలీల సౌకర్యార్థం గ్రీన్ షెడ్యూలు,తాగునీటి వసతి కల్పించాలని వేమనపల్లి ఎంపీడీవో కుమారస్వామి సూచించారు.బుధవారం నీల్వాయి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఉపాధి హామీ నీటి కుంట పనులను పరిశీలించారు.విధిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పనుల నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో ఉండి నిర్దేశిత కొలతలతో పనులు కొనసాగింపుకు కృషి చేయాలన్నారు. కూలీలు 100 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని, ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ఎండకు ముందే పనులు ముగించుకోవాలని సూచించారు.అనంతరం కేతనపల్లి, గొర్లపల్లి, వేమనపల్లి, రాజారం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాతున్న పాఠశాల కాంపౌండ్ వాల్, నర్సరీలు, పశువుల పాకల పనులు పరిశీలించి త్వరగా పనులు పూర్తిచేయాలని సూచించారు. వీరితో ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ సత్యప్రసాద్ ఈసీ మధుకర్, సాంకేతిక సహాయకులు కృష్ణమోహన్ లక్మన్ శ్రీనివాస్, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్షులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News