నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం రాబోయే రోజుల్లో మరింత ప్రకాశించునున్న ఫార్మసీ యనీ మెయిన్ స్ప్రింగ్ వ్యవస్థాపకులు కరిసెట్టి బసప్ప అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెంకట్రామాపురం లో ఉన్న సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల లో క్లినికల్ రీసెర్చ్ హెచ్ ఈ ఓ ఆర్,సి ఆర్ ఓ రంగాలలో స్కోప్,ఉద్యోగ అవకాశాలు పై కెరియర్ గైడెన్స్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరిసెట్టి బసప్ప మాట్లాడుతూ మనిషి మనుగడ ఉన్నంతకాలం అనారోగ్యం వెంటాడుతున్న కాలం ఫార్మసీ రంగానికి మాంద్యం ఉండదని ఫార్మసీ విద్యకు అనేక రకాల ఉద్యోగాలకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం నిరంజన్ బాబు మాట్లాడుతూ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉన్నవారు ఫార్మా మార్కెటింగ్ ఫార్మా కో విజిలెన్స్ క్లినికల్ డేటా ప్రాసెసింగ్ లలో చాలా ఉద్యోగాలు ఫార్మసీ చదువు చదువుకున్న వారికి మెరుగ్గా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటర్ డైరెక్టర్ లక్ష్మయ్య వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజు బోధన సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



