Tuesday, March 31, 2026

10 తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం

  • వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసిన విద్యార్థిని విద్యార్థులు

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల): రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మకండ్రిగ లో బుధవారం పదవ తరగతి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థులు నిర్వహించారు. వీడ్కోలు సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి పడవతరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు మంచిపేరు తేవాలని పేర్కొన్నారు.అనంతరం మండల విద్యాశాఖాధికారి మార్కొండయ్య నాయుడు మాట్లాడుతూ పరీక్షల్లో అక్షర దోషాలు లేకుండా అందంగా రాయాలని పరీక్షల మెలుకువలను విద్యార్థులకు తెలియజేశారు రెండవ మండల విద్యాశాఖాధికారి జయవేలు మాట్లాడుతూ లక్ష్యాలు నిర్దేశించుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్ వి యు తెలుగు ఆచార్యులు డా. పి.సి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి అధికంగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు కలెక్టర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తర్వాత అంగరంగ వైభవంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో కోలాహలంగా విద్యార్థిని విద్యార్థులు పాటలు స్టెప్పులతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ చిట్టిబాబు,ఎస్ ఎల్ టి ఏ జిల్లా అధ్యక్షులు దొడ్డ ఉమామహేశ్వర్, వెంకట్రామయ్య, దిలీప్ కుమార్ , శ్రీనివాసులు, జ్యోతి, విశ్వనాథం, సుబ్రహ్మణ్యం, స్వయంప్రభ భార్గవి లీలా రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News