Tuesday, March 31, 2026

జిల్లాలో డిజిటల్ క్రాప్ బుకింగ్ పంటల నమోదు సర్వే పక్కాగా నిర్వహించాలి

  • జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావు పల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రాప్ బుకింగ్ సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. నాగరాజు అనే రైతు వ్యవసాయ పొలం వద్ద పంట వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.రైతులు సాగు చేస్తున్న పంటకు సంబంధించిన అన్ని వివరాలను పక్కాగా క్రాప్ బుకింగ్ సర్వేలో నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతుతో మాట్లాడుతూ ఏ రకం వరి వేశారు, పంట సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందా, నీటి వనరుల కోసం దీనిపై ఆధారపడ్డారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎరువులు ఎక్కడ కొంటున్నారు? ట్రేడర్లు నాణ్యమైన ఎరువులు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి.. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు.బుధవారం కొత్తకోట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్తకోట జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో సి బి ఎఫ్ నిధులతో నిర్మిస్తున్న ఆరు అదనపు తరగతి గదులు, బాలికల పాఠశాలలో డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మిస్తున్న రెండు తరగతి గదులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా, పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి జెడ్పిహెచ్ఎస్ లో డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మిస్తున్న రెండు మరుగుదొడ్లను కూడా నిలాఖరులోపు పూర్తి చేయాలన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోవిందు నాయక్, కొత్తకోట తహసిల్దార్ వెంకటేశ్వర్లు, పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మీ, పంచాయతీరాజ్ ఏఈలు నరేష్, కార్తీక్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News