Tuesday, March 31, 2026

జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాము కట్టుదిట్టమైన భద్రతగా ఉంది

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : బుధవారం ఆర్డివో కార్యాలయం వెనక ఉన్న ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాము ను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్‌ గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే బుధవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిశితంగా పరిశీలించినట్లు వివరించారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సిపిఎం నుంచి పరమేశ్వర చారి, బీఆర్ఎస్ నుంచి యుగంధర్ రెడ్డి, బిజెపి నుంచి రామన్ గౌడు, అరవింద్, కాంగ్రెస్ నుంచి త్రినాథ్, టిడిపి నుంచి శంకర్, బీఎస్పీ నుంచి భరత్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News