- బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
- ప్రభుత్వ అధికారులతో కరపత్రాలను ఆవిష్కరించారు
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి చెందిన లక్ష్మమ్మ స్థానిక ఎమ్మార్వో తో మాట్లాడుతూ మన గోపాల్ పేట్ మండలం లో బాల్య వివాహాలు లేకుండా చూడాలని దానికోసం అన్ని గ్రామాలలో ఉన్న పంచాయతీ కార్యదర్శిలకు మిగతావారితో సమన్వయం చేసుకొని వాటిని ముందస్తుగా గుర్తించినట్టయితే బాల్య వివాహాలను నివారించ డానికి అవకాశం ఉంటుందని,అందులో భాగంగా ఎవరైనా బాల్య వివాహాలు చేయాలన్న చూస్తే 1098కి సమాచారం ఇవ్వాలని తెలపడం జరిగింది. ఒకవేళ వాళ్ళు బాల్య వివాహాలు చేసుకోవడం ద్వారా రక్తహీనత ఏర్పడడం ఆర్థికంగా వెనుకబడటం, గృహ హింసకు గురవడం, ఉన్నత స్థానాలు అధిరోహించడానికి బాల్య వివాహాలు అద్దంకిగా మారుతాయి చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల శారీరకంగా మానసికంగా కృంగిబాటి ఏర్పడుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మార్వో, ఎస్సై, పోలీస్ సిబ్బంది, అధికారుల చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో తిలక్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేష్ కుమార్, డీసీపీయూ సోషల్ వర్కర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



