Tuesday, March 31, 2026

అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ రైస్ పట్టివేత

నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలము రామాజీపేట్ గ్రామం లో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నిల్వచేసిన 12 క్వింటళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు బుధవారం సాయంత్రం పట్టుకున్నారు. గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసుకున్న 24 బస్తాల పిడిఎస్ బియ్యం వివరాల తమ దృష్టికి రావడంతో ఆ ఇంట్లో తనీఖీలు చేపట్టిన అధికారులకు బియ్యం లభించాయి. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక డీలర్ కు అప్పగించినట్లు సివిల్ సప్లై డిటి వరప్రసాద్, ఎఫ్ ఐ రాజేంద్ర ప్రసాద్, ఆర్ ఐ పద్మయ్యలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News