- పీవీ పురం, చంద్రగిరిలో పార్టీ జెండాలను ఆవిష్కరించిన
- ప్రతి పంచాయతీలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వైసీపీ శ్రేణులు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు బుధవారం వైభంగా జరిగాయి. ప్రతి పంచాయతీలో వైసీపీ శ్రేణులు పార్టీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జగనన్న నాయకత్వంలో పటిష్టంగా పనిచేయడానికి సిద్ధంగా వున్నామని కూటమి పార్టీలకు తెలిసేలా చేశారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందుగా రామచంద్రాపురం మండలం పీవీపురం గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో కలసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తులతో కలసి స్వీట్లు పంచారు. జగనన్న నాయకత్వంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజలకు చేస్తున్న నష్టాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని విన్నవించారు. ఆ తరువాత చంద్రగిరి పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి స్థానికులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులతో కలసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ కనుక ఎన్ని రకాలుగా భయపెట్టాలని, ఎంత మంది ప్రయత్నించినా సరే ఆ పార్టీలో వున్న క్యాడర్ ను భయపెట్టలేరన్నారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు అధికారం కోసం పార్టీలు పెడతారని, జగనన్న మాత్రం ప్రజలకు మంచి చేయాలని, తనను నమ్ముకున్న కార్యకర్తలకు నేనున్నాను అన్న భరోసా కల్పించడం కోసం ఢిల్లీ పెద్దలు అందరూ ఏకమైనా, రాష్ట్రంలో అధికార పార్టీ వేదింపులకు గురి చేస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా 14సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పుట్టించారన్నారు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి పోరాటాలతో పైకి లేచిందని, దేశ రాజకీయాల్లో కనివినీ ఎరుగని రీతిలో విజయాలను సొంతం చేసుకుని దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన ఏకైక పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్న నిజాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలకు ఎవరో ఒక గాడ్ ఫాదర్ వుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే పట్టుకొమ్మలుగా నిలబడ్డారని, పేదల కోసం పార్టీ మరొక్కసారి అధికారం చేపడుతుందని, సువర్ణపాలనను ప్రజల చెంతకు చేరుస్తుందన్నారు. అప్పటి వరకు రాజీలేని పోరాటం చేస్తూనే వుంటామని, అందుకు జగనన్నను ఆదర్శంగా తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మండల పార్టీ అధ్యక్షుడు యద్దల చంద్రశేఖర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు ఏవి బ్రహ్మానందం రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు డిల్లీ రాణి భాను కుమార్ రెడ్డి, వైస్ ఎంపిపిలు లావణ్య చంద్రబాబు, కవితా భాస్కర్ యాదవ్,వాలంటీర్ వింగ్ అధ్యక్షుడు టి గిరిధర్ రెడ్డి, ఎంపిటిసిలు మునేంద్రబాబు, ఎద్దుల రాజేష్, మంజుల సిద్ధారెడ్డి, సర్పంచ్ లు మాదాసు మురగయ్య, నడవలూరు గణపతి రెడ్డి,టెండూల్కర్ , గోవర్థన్ యాదవ్, శేషాద్రి రెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షులు నిరంజన్ రెడ్డి,ముచ్చేలి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మండల గౌడ్ సంఘం అధ్యక్షుడు ఆర్ దేవరాజులు,మారయ్య , సెంథిల్ కుమార్, మురళీ కృష్ణ రెడ్డి, ఆయా మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.





