Tuesday, March 31, 2026

ఛత్తిస్గడ్ వలస కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణి

నేటిసాక్షి /వాజేడు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పేరూరు పరిధిలోని గ్రామాలలో డాక్టర్ రహిల్ ఆధ్వర్యంలో వ్యవసాయ పనులు చేసుకొనే ప్రజలకు,ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన వారికి ఆరోగ్య శిబిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది.వేసవి కాలము ప్రారంభమైంది కనుక ఎండ తీవ్రత వలన వచ్చే వడదెబ్బ,వడగాలులు నుండి తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి,వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వడదెబ్బ వలన శరీరంలోని నీరు అంతా హరించుకపోయినప్పుడు మరల శరీరము లావణాలతో కూడిన నీటిని సమకూర్చుకోవాలంటే ఓఆర్ఎస్ అనే ప్యాకెట్ లోని ద్రావణంలో ఒక లీటర్ నీటిలో కలిపి 24 గంటల వ్యవధిలో తాగవలేనని తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహిల్,హె ఎచ్ఓ వేణుగోపాలకృష్ణ,ఆరోగ్య కార్యకర్తలు తిరుపతి,శ్రీను ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News