Tuesday, March 31, 2026

గేర్రపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

  • పనులు ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్

నేటి సాక్షి, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నూతన గ్రామపంచాయతీ గెర్రపల్లి గ్రామంలో రూ.5లక్షల నిధులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు మీస బీరయ్య భూమిపూజ కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే గెర్రపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే రవాణ శాఖ మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇచ్చిన విధంగానే నిధులు అమలు చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పంతంగి రవీందర్,గుండారపు శ్రీనివాస్, మ్యాకల రాజు, కౌడగాని కిషన్ రావ్, కౌడగాని మోహన్ రావ్, దాసరి రవీందర్,వేముల కొమురయ్య, మామిడి మల్లేష్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News