Tuesday, March 31, 2026

కాలిపోతున్న ట్రాన్స్ఫారం

  • అయ్యో పాపం రైతు గోస

నేటి సాక్షి మహబూబాబా ద్ నర్సింహులపేట భూక్యా రవి : నర్సింహుల పేట మండలంలో భూగర్భ జలాలు తగ్గడం, బావులు, బోర్లలో నీళ్లు ఇంకి పోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు కరెంటు కష్టాలు సైతం రైతులను వెంబడిస్తున్నాయి. పేరుకు24 గంటల నిరంతర కరెంటు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ సాయంత్రం ఐదు అయితే కరెంటు కట్ అవుతుంది రైతులు ఆవేదన చెందుతున్నారు.

చెప్పిన మాట ఏంటి, రైతులకు కష్టాలు ఏంటి…?
రాత్రి 11 గంటల తర్వాత రైతులు మోటర్లు పెట్టేందుకు తిప్పలు పడుతున్నారు. లో వోల్టేజ్ కారణంగా కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునరావృతమవుతున్నాయి. పొలానికి నీళ్లు పెట్టేందుకు కరెంటు కోసం అర్ధరాత్రి పడిగాపులు మొదలయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, పెద్దనాగారం స్టేజ్ గ్రామానికి చెందిన అల్లిపురపు రవీందర్ రెడ్డి సొంత ఖర్చులతో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశాడు. దీంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు భూగర్భ జలాలు అడుగంటి, మరోవైపు చాలీచాలని కరెంటుతో పంటలకు నీళ్లందక ఎండిపోతుంటే.. నాణ్యతలేని ట్రాన్స్‌ఫార్మర్లతో కాలిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. అలాగే ఎండలు ముదరకముందే అప్రకటిత కొతలు మొదలయ్యాయి. దీంతో రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ వోల్టేజ్ పేరుతో మధ్యాహ్నం సమయంలో గంట నుండి రెండు గంటల వరకు కరెంటు తీసేస్తున్నారు. లో వోల్టేజీ కారణంగా, మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించి రైతుల మోటర్లు కాలిపోకుండా సహకరించాలని రైతులు కోరుతున్నారు. నేను మూడెకరాల్లో వరి పొలం నాటేసాను గత పది సంవత్సరాల నుండి కరెంట్ కష్టాలు లేకుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చా క చాలీసాలుగా కరెంటుతో ఇబ్బందులకు పడుతున్నావ్ వారానికి ఒకసారి కా లువ నీళ్లు వస్తుంది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో తీసుకున్న పంటలు నిండిపోతున్నాయి భయంతో ట్రాన్స్ఫార్మర్లు ప్రైవేట్ వాహనం లో మరమతు కేంద్రానికి తీసుకెళ్లి మరమ్మతులు చేశాక మళ్ళీ తీసుకొచ్చాము. మరోవైపు కరెంట్ కష్టాలు మొదలైంది ఇప్పుడు అర్ధరాత్రి పడుకున్నాము టార్చ్ లైట్ చేతపట్టి చిమ్మ చీకటిలో కాపాడేందుకు ప్రాణాలను ఘనంగా పెడుతున్నారు. పాములు, సాహసం చేస్తున్నాను. అల్లిపురం రవీందర్ రెడ్డి రైతు పెద్ద నాగారం స్టేజి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News