Wednesday, April 1, 2026

బైక్ ను ఢీకొన్న అడవి పంది… రైతు మృతి

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): బైక్ ను అడవి పంది ఢీ కొట్టడంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఆర్.ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన సంగ శ్రీనివాస్ తండ్రి లింగయ్య (46) రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తన ద్విచక్ర వాహనం (ఎపి15బిజే5301) పై మంగళవారం సాయంత్రం ఇంటి నుండి గ్రామ శివారులోని పొలానికి కెనాల్ ద్వారా సాగు నీరు పెట్టేందుకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రాత్రి మార్గమధ్యన తొండం ఏరియాలో అకస్మాత్తుగా బైక్ ను అడవి పందుల గుంపు వచ్చి ఢీ కొట్టడంతో మృతుడు రోడ్డు పై బోర్ల బొక్కల పడగా తలకు, పలు చోట్ల తీవ్ర గాయాల పాలై ముక్కు, చెవుల్లో నుండి రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. మృతుని కుమారుడు సంగ విష్షువర్ధన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. కాగా మృతుడు గత 26 సంవత్సరాల క్రితం ముత్తునుర్ నుండి కొండాపూర్ కు ఇల్లరికం వచ్చి మృతిచెందడంతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News