నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వరంగల్ ములుగు రోడ్డు లో లాల్ బహదూర్ విద్యా కళాశాల లో బుధవారం వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని కాబోయే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి భవిషత్తు లో మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని.. కాలేజీ పేరు నిలబెట్టాలని టీచర్ ఉద్యోగం కోసమే కాకుండా గ్రూప్ పరీక్షల పై కూడా దృష్టి పెట్టాలని ఇదే కాలేజీ లో మొదటి లెక్చరర్ గా నియామకం అయ్యానని ఇప్పుడిదే కాలేజీ లో గెస్ట్ గా వచ్చానని ఎల్ బి కాలేజీ అనేది ఒక బ్రాండ్ అని సంతోషాన్ని వెలిబుచ్చారు. లెక్చరర్లకు, విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చి తన గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలను అంద జేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్దులు అలరించారు విశిష్ట అతిథిగా కాకతీయ యూనివర్సిటీ విద్యా విభాగం డీన్ ప్రొఫెసర్ రామ్ నాథ్ కిషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ శ్యాం సుందర్, సెక్రటరీ ప్రేమ్ కుమార్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ జస్పాల్ సింగ్, ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసాద్, లెక్చరర్స్, ఛాత్రోపాద్యాయులు పాల్గొన్నారు.





