Tuesday, March 31, 2026

రిలే నిరాహార దీక్షలు

  • ఎం ఎస్ పి (ఎం ఎస్ పి) సీనియర్ నాయకులు ఆరేపల్లి పవన్ మాదిగ

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు హసన్ పర్తి రెవెన్యూ ఆఫీసు ముందు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యం లో రాజారపు బిక్షపతి మాదిగ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆరేపల్లి పవన్ మాదిగ ప్రారంభించి మాట్లాడుతూ.. ఆగస్టు 4న నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ల వర్గీకరణను స్వాగతించి వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దేశంలోనే మొట్ట మొదటిగా వర్గీకరణ చేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు కు ప్రత్యేక ఆర్డినెన్సు చట్టాన్ని తెచ్చి మాదిగలకు మరియు ఉప కులాలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాలల ఒత్తిడికి తలోగ్గి అత్యంత ప్రాధాన్యం కలిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 తో పాటు అనేక ఉద్యోగాలలో మాలలకు దోచి పెట్టే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. తన ఇచ్చిన మాటను నిలుపు కోవాలని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల లో గాంధేయ మార్గంలో మాదిగ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెట్టి నియంత పాలన కొనసాగిస్తున్నారు రాబోవు స్థానికల సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మండల ప్రజా పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు మరియు ఉప కులాలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే శాస్త్రీయంగా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చట్టం చేసి ప్రకటించిన ఉద్యోగ నియమాకాలను భర్తీ చేయాలని అన్నారు. ఈ దీక్షలను సందర్శించి సంఘీభావం తెలిపిన ఎంఎస్పీ జాతీయ నాయకులు వేల్పుల సూరన్న మున్నూరు కాపు ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు. కొయ్యడ మల్లేష్ మాదిగ సంఘీభావం ప్రకటించారు. దీక్షలో పాల్గొన్నవారు. రాజారపు బిక్షపతి మాదిగ ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు, నమిండ్ల సూర్యం మాదిగ జిల్లా నాయకులు సందెల యాదగిరి మాదిగ, ఎం ఎస్ పి మండల కన్వీనర్ తాళ్ల సంపత్ మాదిగ, ఎంఎస్పి జిల్లా నాయకులు వెల్తూరి మహేష్ మాదిగ, నదునూరి గోపి మాదిగ, నమిండ్ల ప్రసాద్ మాదిగ, మేకల మహేందర్ మాదిగ, రామంచ సంపత్ మాదిగ, వంశీ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News