Tuesday, March 31, 2026

ప్రభుత్వ భూములను కాపాడండి

  • మండల అధికారికి వినతి పత్రం అందించిన నవతెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధనకార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్

నేటి సాక్షి, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్థలం విషయంపై గురువారం రోజున పట్టణంలోని తహసిల్దార్ కు అమ్మ వెంకటేష్ యాదవ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వద్ద అమ్మ వెంకటేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సర్వే నెంబర్ (647) గల ప్రభుత్వ స్థలాన్ని 50 సంవత్సరాల క్రితం శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు లీజ్ నిమిత్తం 35 సంవత్సరాలు 2 ఎకరాల స్థలాన్ని అప్పటి సర్పంచ్ కృష్ణంరాజు పాలకవర్గం సభ్యులందరు తీర్మాణం చేసి, ఈ స్థలాన్ని పాఠశాలకు ఇవ్వడం జరిగింది. అప్పటి పాఠశాల చైర్మన్ కాంతారావు 2002 సంవత్సరంలో మరణించడంతో ఆ పాఠశాలను మూసివేయడం జరిగింది. తదనంతరం ఆ స్థలం నిరుపయోగంగా ఉండడంతో కొంతమంది నాయకులు, ప్రజా ప్రతినిధులు అక్రమంగా కబ్జా చేసి తప్పుడు పత్రాలను సృష్టించి అమాయకమైన ప్రజలకు ఆ స్థలాన్ని అమ్మడం జరిగింది. ఒకప్పటి ప్రభుత్వ స్థలం ఇప్పుడు ప్రైవేట్ గా ఎలా మారింది, అని దీనికి సహకరించినటువంటి అధికారుల, ఆ ప్రజా ప్రతినిధుల పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా ఈ స్థలాన్ని పరిశీలించి దీనిపై విచారణ చేపట్టి ఈ స్థలం, ఒకవేళ ప్రభుత్వ భూమి ఏ అని తేలినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆ భూమిని ఎంతోమంది సొంత గూటి లేక రోడ్లపై గడుపుతున్నటువంటి పేద ప్రజలకు కేటాయించాలని జమ్మికుంట మండల అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దీనిపై కాలయాపన చేసిన తప్పుదోవ పట్టించాలని చూస్తే ఈ విషయంపై కొట్టడానికి ఎంతవరకైనా ఎంత దూరమైనా వెళ్లడం జరుగుతుందని, రాష్ట్ర స్థాయి దాక వెళ్లి ఈ స్థలం పేద ప్రజలకు అందే వరకు నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు.

విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటాము

ఈ విషయంపై మండల అధికారిని వివరణ కోరగా అమ్మ వెంకటేష్ యాదవ్ శ్రీనివాస ఇంగ్లిష్ మీడియం పాఠశాల గల స్థలంలో అవకతవకలు జరిగాయని వినతి పత్రం సమర్పించారు. ఈ స్థలంపై విచారణ చేపట్టి ఒకవేళ ఆ సర్వే నెంబర్ ప్రకారం పాఠశాల స్థలం ప్రభుత్వం దేనని తేలితే, కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News