Tuesday, March 31, 2026

విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నుల పంపిణీ

  • బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా…
  • కొమ్ము నరేష్ బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ జమ్మికుంట

నేటి సాక్షి, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా జమ్మికుంట పట్టణ బి ఆర్ ఎస్ వి విద్యార్థి విభాగం అధ్యక్షులు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశఉద్యమంలో ఒక మహిళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తనదైన శైలిలో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారకులుగా ఉన్న కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా రానున్న రోజుల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంలో పేద విద్యార్థులకు పరీక్షల నిమిత్తం వారికి ఎగ్జామ్ పాడ్స్ పెన్నులు స్కేలు కంపాక్స్ బాక్స్ లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గత పది సంవత్సరాలు చూసుకున్నారని ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత అధికారుల పైన ఉందని, ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత కి జమ్మికుంట పట్టణ బిఆర్ఎస్వి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్ము నరేష్, జవాజి ,అనిల్ వేల్పుల, శ్రీకాంత్, చింతల కౌశిక్, పాతకాల అజయ, ఓల్లాల శ్రీకాంత్, ఎండి రెహమాన్, గడ్డం సంపత్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News