Tuesday, March 31, 2026

ఎస్ఎఫ్ఎస్ స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

  • డ్రైవర్ నిర్లక్ష్యం..1
  • న్యాయం చేయాలని అడిగితే ఉల్టా బెదిరింపులు

నేటి సాక్షి – కథలాపూర్ ( రాధారపు నర్సయ్య )

డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో గురువారం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..పోసానిపేట గ్రామానికి చెందిన ఎర్రయ్య (70) ఉదయం టీ తాగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోరుట్ల ఎస్.ఎఫ్.ఎస్ ప్రైవేట్ స్కూల్ కు చెందిన టిఎస్ 21 టీ 2373 నెంబర్ గల బస్సుతో రివర్స్ డ్రైవింగ్ లో వెళ్తూ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఎర్రయ్యను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మృతి చెందారు.

స్కూల్ యాజమాన్యం ఉల్టా బెదిరింపులు

బస్ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా అమాయకుడైన వృద్ధుడు ఎర్రయ్య ప్రాణాలు పోయాయని గ్రామస్తులు ఎస్ఎఫ్ఎస్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.దీనికి యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా..వ్యవహరిస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మాకేం ఫరాక్ పడదు అని అహంకార పూరితంగా సమాధానం చెప్పారని ఆరోపించారు.ఈనేపథ్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.


  1. ↩︎

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News