నేటిసాక్షి చందుర్తి (సతీష్):
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని అసినిపర్తి దేవయ్య ఇటీవల అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం మరణించాడు. అతనిది చాలా బీద కుటుంబం కావడంతో అంత్యక్రియలు కూడా చందాలు వేసుకొని జరిపించారని తెలుసుకొని మల్యాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ గ్రూపు వారు అతని భీద స్థితిని గమనించి అతనికి ₹10,200 నగదును అలాగే 50 కిలోల రైస్ బ్యాగులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య, ఏఎస్ఐ తో పాటుగా దుబాయ్ గ్రూప్ యొక్క ఆర్గనైజర్లు మాదం బాబు, కొడగంటి గంగాధర్, లోకోజు సతీష్ , పాటి సుధాకర్, ఈసరి శ్రీనివాస్, కోన నర్సయ్య, మాదం అశోక్ తదితరులు పాల్గొన్నారు.





