నేటి సాక్షి,వేమనపల్లి
గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనకు కాంగ్రెస్ సర్కారు నిరంతరం కృషి చేస్తుందని మాజీ జెడ్పిటిసి ఆర్.సంతోష్ కుమార్ పేర్కొన్నారు.గురువారం జిల్లెడ గ్రామపంచాయతీ పరిధిలోని జక్కపల్లిలో ఎన్అర్ఈజీఎస్ నిధుల నుండి విడుదలైయిన 20లక్షల రూపాయిల సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ తో కలసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ వేమనపల్లి మండల అభివృద్ధికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు ముల్కల్ల సత్యనారాయణ,వైస్ ఎంపిపి ఆత్రం గణపతి,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.





