Wednesday, April 1, 2026

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)

హోలీ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంత వంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హోలీ అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని, ఒక వేళ వెళ్ళాసి వస్తే తగు జాగ్రత్తలను పాటించాలని, ప్రధానముగా బహిరంగ ప్రదేశాలపై, అనుమతి లేకుండా వ్యక్తులపై, మహిళలు, యువతులు, వాహనాలపై రంగులు చల్లడం బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని. హోలీ పండుగను సజావుగా జరుపుకొనేందుకు వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించ బడుతుందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News