Wednesday, April 1, 2026

ట్రిపుల్ ఐటి క్యాంపస్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు)

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం లోని ప్రభుత్వ భూములను బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్, హైదరాబాద్ జేఎన్టీయూ విశ్రాంత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, తహసీల్దార్ జగత్ సింగ్, స్థానిక అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. బాసర ట్రిపుల్ ఐటీ ఎక్స్టెన్షన్ క్యాంపస్ ఏర్పాటుకు స్థల పరిశీలనకు వచ్చిన ఇంచార్జ్ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ గోవర్ధన్, విశ్రాంత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ లు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రావీణ్యను కలిసి ఎక్స్టెన్షన్ క్యాంపస్ స్థాపనకు కావలసిన భూమి గురించి వివరాలను తెలియ జేశారు. బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ ఎక్స్టెన్షన్ ఏర్పాటుకు అనువుగా తొలుతా యాభై ఎకరాల భూమి కావాలని ప్రతి పాదించగా భవిష్యత్తు అవసరాల కోసం మరో 50 ఎకరాలు (మొత్తం 100 ఎకరాల భూమి) కేటాయించాలని బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్ లు ప్రాథమిక ప్రతి పాదనలను చేశారు. క్యాంపస్ ఏర్పాటు కోసం కావాల్సిన వంద ఎకరాల భూమి గురించిన వివరాలను కలెక్టర్ తో సమావేశమై వివరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News