- అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్క్ శ్రీనివాస్ రెడ్డి
నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)
ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్క్ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో నాభిశిలా బొడ్రాయి ప్రతిష్టించి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ముత్యాలమ్మ బొడ్రాయిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన వార్షికోత్సవానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మొక్కలు చెల్లించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గునుకుల గోపాల్ రెడ్డి, బుర్ర పుల్లారెడ్డి, డేగ కొండయ్య, ముత్తినేని కోటేశ్వరరావు, గ్రామ పెద్దలు వేణు తదితరులు పాల్గొన్నారు.





