- పాలవరం బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా మాదాసు శ్రీకాంత్ ఎన్నిక
నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)
గ్రామాల అభివృద్ధి ధ్యేయమే బిఆర్ఎస్ లక్ష్యమని పాలవరం బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాదాసు శ్రీకాంత్ అన్నారు.కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం గురువారం అనంతగిరి మండల పరిధిలోని పాలవరం గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాకు సహకరించిన గ్రామ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధి తోడ్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో పేదలకు, రైతులకు, వికలాంగులకు, ఎలాంటి వారైనా ఆపదలో ఉన్నానంటే వారికి పెద్దదిక్కుగా నిలబడి అదుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే ప్రజలకు మోసం చేసే పాలనేనా అని చెప్పారు. మాటలు తప్ప చేతలో పని తనం లేదని ఎద్దేవా చేశారు.అనంతరం గ్రామ యూత్ ఉపాధ్యక్షుడిగా మాదాసు నాగేంద్రబాబు, సలహాదారులుగా ప్రవీణ్ ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





