- భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు
- ఆడపడుచులు బోనాలతో ఊరేగింపు
- కనుల పండగ సాగిన వార్షికోత్సవం


నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గోల్ తండా గ్రామంలో నాభిశిల బొడ్రాయి ప్రతిష్టించి మూడు సంవత్సరాలు కావడంతో ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం కూడా నాభిశిల బొడ్రాయి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఈ వార్షికోత్సవానికి సూర్యాపేట జిల్లా ఆదివాసి ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాబు నాయక్ పాల్గొని మాట్లాడారు… గ్రామదేవతలను ఏర్పాటు చేసుకొని మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ముత్యాలమ్మ కు ఆడపడుచులు బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించారని తెలిపారు. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులు అమ్మవారికి తీర్థ ప్రసాదాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వేణు, సైదులు, బికు, శివాజీ, దుర్గ ప్రసాద్, కోటేశ్వరరావు, కృష్ణ,కస్సు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.





