Wednesday, April 1, 2026

ప్రభుత్వం క్రీడారంగంపైన ప్రత్యేక దృష్టి సారించి క్రీడా మైదానాలు అందుబాటులో తెస్తున్నాం

  • తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవాని గుంట క్రికెట్ మైదానం ను శాప్ చైర్మన్ రవి నాయుడు, మున్సి పల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి : నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవాని గుంట క్రికెట్ మైదానం ను శాప్ చైర్మన్ రవి నాయుడు, మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పరిశీలించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని ఆటోనగర్ నందు స్మార్ట్ సిటీలో భాగంగా గొల్లవాని గుంట క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులు పరిశీలించి అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ మైదానం పనులు దాదాపు పూర్తయ్యాయని 65 మంది సీటింగ్ సామర్థ్యంతో పెవిలియన్ 315 మంది సభ్యుల సీటింగ్ సామర్థ్యంతో గ్యాలరీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 6 కోట్లు రూపాయలని, అందులో పూర్తయిన పనుల విలువ సుమారుగా రూ. 4.5 కోట్లని తెలిపారు. ఇంకా 1.5 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయాల్సి ఉందని, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు అదనముగా శాప్ వారి నుండి 2 కోట్లు నిధులను మంజూరు చేస్తామని శాప్ చెర్మన్ తెలిపారన్నారు. మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ, కోకో వాలీబాల్ వంటివి ఇందులో నిర్వహించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రికెట్ పిచ్ లను ఈ నెలలోనే అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిగిలిన పనులు సకాలంలో పూర్తిచేసి శాప్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. దాని నుండి వచ్చే ఆదాయాన్ని దాని అభివృద్ధి పనులకు, స్టేడియం నిర్వహనకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ డ్రై స్టోన్ పిచింగ్ మరియు వాకింగ్ ట్రాక్, బండ్ లైటింగ్, రైలింగ్, బండ్ లైటింగ్ మరియు హార్టికల్చర్ అభివృద్ధి పనులు, 3 పిచ్‌లతో కూడిన క్రికెట్ మైదానం, హై మాస్ట్ లైటింగ్, గడ్డి టర్ఫింగ్, డ్రెయిన్లు మరియు పెవిలియన్ తదితర పనులు సకాలంలో పూర్తి చేస్తాం అన్నారు. మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ లో భాగంగా ఈక్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నామని, నగర వాసులకు అనుకూలమైన ప్రదేశం అని, ఈ మైదానం నగర నడి బొడ్డున ఉన్నందున క్రీడ ప్రియులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. అతి త్వరలో పనులు పూర్తి చేసి స్పోర్ట్స్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందన్నారు.
శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడా, విద్య, వైద్య టూరిజం ఇతర రంగాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త జిల్లాలో వివిధ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తిరుపతిని క్రీడా హబ్, సంస్కృతిక హబ్ , టూరిజం హబ్ గా మార్చాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ధృడ సంకల్పంతో ఉన్నారన్నారు. వారి ఆదేశానుసారం ఇప్పటికే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గారి చొరవతో దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. గొల్లవాని గుంట క్రీడా మైదానం అందుబాటులోకి వస్తే జిల్లా నుండి ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు అన్నారు. ఈ మైదానంలోనే స్థానికులకోసం కబడ్డీ, కోకో, వాలీబాల్ వంటి ఇతర క్రీడల కొరకు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొస్తున్నామన్నారు. క్రికెట్ ఆటకు పిచ్ ను సిద్ధం చేస్తామని, త్వరలోనే ఈ మైదానాన్ని సంపూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ ఎస్ ఈ సురేంద్ర, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, స్పోర్ట్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News