Wednesday, April 1, 2026

వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయం…

  • శ్రీవారికి పట్టు వస్త్రాలు, చందన సుగంధ హారాలు సమర్పించిన
  • జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

నేటిసాక్షి/మంగపేట : వెంకటేశ్వర కళ్యాణం కమనీయం అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు శుక్రవారం ఆయన నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సాంబశివరెడ్డి స్నేహలత దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకుని కళ్యాణానికి హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామి వారిపై ఉన్న భక్తితో వెంకటేశ్వరుని కళ్యానం సందర్భంగా పట్టు వస్త్రాలు చందన సుగంధ హారాలు ఈ రోజున సమర్పించినట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సు, సకల జనులకు మంచిని ప్రసాదించాలని దేవుడిని కోరినట్లు సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రవణం సత్యనారాయణ అజయ్ పురోహితులు సాంబశివరెడ్డి వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ సంవత్సరం స్వామివారి కల్యాణానికి వేలాది సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News