నేటిసాక్షి/మంగపేట : మండలంలో బీజేపీ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో హోలీ వేడుక సంబరాలు ఘనంగా జరుపుకున్నారు బీజేపీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అమావాస్య మొదటి రోజు నుండి మొగోళ్ళ కొలలాట ఆడవారి చప్పట్లు ఆటలు పాటలతో కాముని పున్నంతో కామున్ని అగ్నిలో కాల్చి చెడులను వదిలి మంచి అలవాట్లు పెంచుకోవాలని పకృతి అటవీ తల్లి ఆకురాల్చుకొని పచ్చని ఆకులతో రంగు రంగులతో ముస్తాబు అయ్యింది అనే దానికి నిదర్శనం అటవీ పూలు మోదుగు గోగు పూలు తీసుకు వచ్చి ఉడకపెట్టి వచ్చే రంగుల్ని తెల్లవారితే చిన్నా పెద్ద తేడా లేకుండా ఒక్కరి మీద ఒక్కరు అనురాగంతో ఆప్యాయత తో పలకరింపుతో ఈ సంవత్సరం అంతా సరైన సమయాల్లో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతుల జీవితాల్లో రంగు రంగుల వెలుగులు నింపాలని ఇట్లనే రంగు రంగులతో నవ్వుతూనే ఆనందంగా ఉండాలని పూసుకునే రంగుల పండుగే రంగేళి హోలీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పల్నాటి సతీష్ జిల్లా కౌన్సిల్ మెంబర్ చల్ల రాంకీ బీజేవైఎం మండల అధ్యక్షులు గుండు రాజేష్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి కట్టుకోజు ప్రశాంత్ కమలాకర్ కర్రీ శ్రీనివాసరావు సాధనపెల్లి సమ్మయ్య పాల్గొన్నారు.





