Wednesday, April 1, 2026

స్పష్టమైన కారణం లేకుండా జగదీష్ రెడ్డి ని సస్పెండ్ చేయడం హేయమైనా చర్య

  • జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం పట్ల,అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు
  • బాసు హనుమంతు నాయుడు
  • కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ను అడ్డుకున్న పోలీసులు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు, కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల నియోజకవర్గం పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అంతక ముందు, అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి, బాసు హనుమంతు నాయుడు పూల మాల,వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసులు నిరసనకు అనుమతి ఇవ్వకుండా మాకు అడ్డుపడ్డారు అని అన్నారు. పేరుకేమో ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొంటూ.. ప్రజల తరఫున మాట్లాడే మా పార్టీ సభ్యుల గొంతు నొక్కడం ఏమిటి’ అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ విలువలకు పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో బీఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు జగదీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనని మాటలు అన్నట్టు ఆరోపించి అబద్ధాల ఆధారంగానే జగదీశ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని మండిపడ్డారు. బడ్జెట్‌ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే కాంట్రాక్టులు,కమీషన్లు,ఢిల్లీకి పంపుతున్న మూటల విషయాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని దెప్పిపొడిచారు.పథకం ప్రకారమే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ అని విమర్శించారు. ‘ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కటం, సస్పెండ్‌ చేయటం ఇదేనా ప్రజా పాలన?’ అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు మోనేష్, బీచుపల్లి, శ్రీరాములు, గంజిపేట రాజు, తిరుమలేష్, తిమ్మప్ప గౌడ్, ముని మౌర్య,గోవర్ధన్, ఆటో ముక్బాల్, వసుంధర, రమేష్, వీరేష్ గంగాధర్, చిన్న, వెంకటేష్, జమాన్నబతకన్నా, ఇమ్మనేయులు, ఆంజనేయులు, అనిల్, సురేందర్, కామేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News