Wednesday, April 1, 2026

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

నేటి సాక్షి, వీణవంక: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణను దాతల సహకారంతో చేయుచున్నారు. ఇందులో భాగంగా ఈ శుక్రవారం 4 వ వారం మేకల రాజిరెడ్డి స్మారకార్థం వారి సతీమణి మేకల ప్రమీల అన్నప్రసాద వితరణ చేసినారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతు ఇక్కడ స్వయంబు వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్న ప్రసాద వితరణ చేసి రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గణేష్ కళాబృందం వారిచే భజన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆలయంలో ప్లాస్టిక్ రహితంగా పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రయత్నం చేస్తూ పేపర్ ప్లేట్లు గాని, ప్లాస్టిక్ గ్లాసులు గాని వాడకుండా మోదుగు ఇస్తార్లలో భోజనం వడ్డిస్తున్నామని తెలియజేశారు. ఈ మంచి కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరినారు. అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా భక్తులు పైన ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News