Wednesday, April 1, 2026

హిందూ పండుగలపైనే ఆంక్షలు ఎందుకు? మిగతా మతాలకు ఇదే ధోరణి చూపగలరా?

ప్రజగొంతుక ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ హిందూ సోదరసోదరీమణులందరికీ హోలీ శుభాకాంక్షలు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడం రామకృష్ణారెడ్డి అయితే, హిందువుల ఆనందాన్ని అణచివేయాలనే కుట్ర తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ చేయడం ఎంతవరకు న్యాయం? హోలీ, దసరా, శ్రీరామనవమి, వినాయక చవితి, దీపావళి, ఉగాది. ఏ హిందూ పండుగ వచ్చినా పోలీస్ శాఖ ఆంక్షల మోత మోగించడం ఏమిటి? హిందూ పండుగలపైనే ఈ కఠిన ఆంక్షలు… మిగతా మతాల వేడుకలకి మాత్రం ఎందుకు నిబంధనలు ఉండవు? ఇది పాలన కాదు – ఇది హిందువుల పట్ల స్పష్టమైన వివక్ష! హిందువుల పండుగలపై ఆంక్షలు పెట్టే తప్పుడు నిర్ణయాలను తక్షణమే వెనక్కు తీసుకోవాలి. లేకపోతే, ప్రజల తీర్పు ఎప్పుడు, ఎలా ఉంటుందో పాలకులు మరువకూడదు! హిందువుల భక్తిని, సంస్కృతిని కించపరిచే ప్రభుత్వం ఉండదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News