Wednesday, April 1, 2026

హోలీ పండుగ వేళ రంగులు పూసుకుని, నీటి జల్లులలో తడుస్తూ ఘనంగా హోళీ వేడుకలు !!!

  • సామాజిక ఐక్యతకు ప్రతీక హోళీ
  • హోలీ వేడుకల్లో పాల్గొన్న జర్నలిస్టులు
  • జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : అందరూ ఐక్యంగా ఎలాంటి తారతమ్య వయో భేదం లేకుండా ఆనందంగా జరుపుకునే సంబరం హోళీ అని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయముకు చేరుకున్న అధికారులు సిబ్బంది ముందుగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ కి అధికారులు, సిబ్బంది రంగులు పూయడంతో ప్రారంభమైన హోలీ సంబురాల్లో ఎస్పీ తో పాటు డీఎస్పీలు,సిఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది సైతం తమ స్థాయిలను మరిచి హోలీ సంబురాల్లో మునిగితేలారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుపోవడంతో పాటు ఎస్పీ ని అధికారులు సిబ్బంది వారి భుజాలపై ఎత్తికొని పోలీసులు కేరింతతో

పండుగ వేళ సిబ్బందికి రంగులు రాసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ సంబురాలలో జిల్లాలోని పాత్రి కేయులు మరియు సాహితి కళావేదిక ప్రతినిధులు పోలీసు కార్యాలయానికి చేరుకోని ఎస్పీ పరస్పర ఇరువురు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి రంగులతో సామాజిక ఐక్యతతో ఆనందాన్నివ్యక్తపరిచే పండుగగా ఆయన అభివర్ణించారు.ఇలా కలసి మెలసి ఆడటం వల్ల అందరికీ తమ బాల్యం గుర్తు వస్తుందని తన చిన్ననాటి విషయాలను కూడా ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఉట్టి కొట్టడం లాంటి ఒక వేడుకను నిర్వహించి అందులో విజేత అయిన కు ఐదు వేల రూపాయల నగదు బహుమతి ని ఎస్పీ రావుల గిరిధర్ అందజేశారు.

ఇక ఈ హోలీ పండుగ సందర్భంగా వనపర్తి జిల్లాల్లో ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం పోలీసుల బాధ్యత.కాబట్టి కొంతమంది పోలీసులు మాత్రమే ఈ హోలీ ఉత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. మిగతా పోలీసులు మొత్తం కూడా హోలీ పండుగ రోజు శాంతి భద్రతలు లోపించకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు ఎస్పీ, ఉమా మహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, వనపర్తి సిఐ, కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, ఎస్సైలు, జర్నలిస్టలు, గుండ్రాతి మధు గౌడ్, మాధవరావు, కే, రవిశంకర్, రాజు, ప్రశాంత్, విజయ్, మన్యం, భాస్కర్, రవికాంత్, ఆంజనేయులు, దినేష్, మల్లికార్జున్, ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్, బైరోజు చంద్రశేఖర్, శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది, అధిక సంఖ్యలో హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News