నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలం లోని గ్రామాల్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులు యువతి యువకులు ప్రజా ప్రతినిధులు అధికారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ యువకులు కేరింతల మధ్య ఉత్సవంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి దేశరాజ్ అనిల్ రాపోలు నవీన్ మాతంగా అనిల్ బుర్ర తిరుపతి గౌడ్ వేదిరే విజేందర్, మంగరాపు అనిల్ చిట్కూరి కొమురయ్య పెంకర్ల ప్రశాంత్ న్యాత నరేష్ తదితరులు పాల్గొన్నారు.





