నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ప్రజల జీవితాల్లో మార్పులు సంభవించి, వారి జీవితాలు రంగులమయం కావాలని పట్టణ విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కమ్మరి భరత్ కుమార్ చారి అన్నారు. శుక్రవారం హోలీ పండుగ పురస్కరించుకొని విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందాపూర్ రోడ్ లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం లో జరుపుకునే పండుగల్లో హోళీ ఒకటని, ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటారని అన్నారు.ఈ రంగుల పండుగ మనందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, మరియు శాంతిని నింపాలని కోరుకుంటున్నాను. ప్రేమ, స్నేహం, సహనంతో మెలిగే సందేశాన్ని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుందని అన్నారు. సప్త వర్ణ శోభిత సమ్మేళనం.వసంత శోభతో ఫరిడవిల్లే పర్వదినం. ప్రేమ, ఐక్యత, ఆనందానికి ప్రతీక రంగుల కేళీ…హోళి అని అన్నారు.ఈ హోళీ పండుగ సందర్భంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండి, సుఖసంతోషాలతో గడపాలని ఆయన ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్పెంటర్లు కె.శివ చారి,మారోజు శివ కృష్ణ చారి, కసోజు నరేష్ చారి, కనకం శేఖర్ చారి, వడ్ల నవీన్ చారి, బాలకృష్ణ చారి, కమ్మరి శివ కుమార్ చారి, వెంకటేష్ చారి,శ్రీశైలం చారి, కిరణ్ కుమార్ చారి చందు చారి, శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.





