- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : హైదరాబాద్ నుండి వనపర్తికి వస్తున్న ప్రయాణంలో మూసాపేట మండలం దగ్గర ప్రమాదం జరిగిన సంఘటనను చూసి చలించిపోయిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి. వివరాల్లోకి వెళితే హైదరాబాదు నుండి వనపర్తికి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి శుక్రవారం వస్తుండగా మూసాపేట దగ్గర కారు బైకును ఢీకొట్టిన ప్రమాదాన్ని చూసి చలించిపోయిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మానవ దృక్పథంతో వెంటనే క్షతగాత్రులను పరిశీలించి తన సొంత చరవానితో అంబులెన్స్ కు సమాచారం తెలిపి మహబూబ్ నగర్ హాస్పటల్ కు పంపించడం జరిగింది. క్షతగాత్రులు స్నేహ చికెన్ కంపెనీలో పనిచేసే నాగరాజు ,వాసు గా గుర్తించారు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా పక్కల వారికి ఎలాంటి ప్రమాదం జరిగిన పట్టించుకోకుండా వెళ్తున్న ఈ రోజుల్లో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముసాపేట మండలంలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన దగ్గర వెంటనే తన సొంత వాహనాన్ని నిలిపి గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించే విధంగా కృషి చేసిన చిన్నారెడ్డికి రహదారి మీద వెళ్లే వాహనదారులు అక్కడ ఉన్న ప్రజలు చిన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.





