Wednesday, April 1, 2026

మెట్ పల్లి లో కాన్సిరాం జయంతి వేడుకలు

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పట్టణంలో మాన్యశ్రీ కన్షీరామ్ తొంబై ఒకటవ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల లక్ష్మణ్ మాట్లాడారు.మన్యశ్రీ కాన్సిరాం ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ స్థాపించి భారతదేశంలో ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఏర్పాటు చేయాలని లక్ష్యంతో తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు మన్యశ్రీ కాన్సిరాం అన్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి దళిత స్త్రీ బహెన్ జి కుమారి మాయావతిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని కొనియాడారు. భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఏకమై కన్సీరామ్ ఆలోచనతో విధానాలతో బహుజన రాజ్యం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోరుమంతుల సురేందర్,నిరటీ నరేందర్, కురుమ దేవయ్య, తారి స్వామీ, మేకల ఉపేందర్ సజన పవన్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News