Wednesday, April 1, 2026

స్వచ్చ అవిలాల- స్వర్ణఅవిలాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని

  • తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామపంచాయతీలో స్వచ్చ అవిలాల- స్వర్ణఅవిలాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పులివర్తి నాని
  • పంచాయతీ కార్యాలయం నుంచి శ్రీ చక్ర గార్డెన్ వరకు పిల్లలచే ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయ సాధనలో భాగస్వామ్యం అవుదాం: ఎమ్మెల్యే పులివర్తి నాని

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం పరిధిలోని అవిలాల పంచాయతీలో సర్పంచ్ చెందిలి వెంకటరమణ అధ్యతన స్వచ్చ అవిలాల – స్వర్ణ అవిలాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ముందుగా అవిలాల గ్రామపంచాయతీకి విచ్చేసిన ఆయనకు అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అవిలాల గ్రామ సచివాలయం నుండి శ్రీ చక్ర గార్డెన్ వరకు స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిన్నారులచే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం”స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని పంచాయతీలలో, గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు తదితర విభాగాలలో అంకిత భావంతో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా “స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. దానిలో భాగంగా అవిలాల పంచాయతీలో “స్వచ్చ అవిలాల- స్వర్ణ అవిలాల”లో తడి చెత్త – పొడి చెత్త పై ప్రజలకు సచివాలయ సిబ్బంది అవగాహన కల్పిస్తూ …. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని చెత్తను తడి చెత్త, పొడి చెత్త ను వేరు చేసి వారి ఇంటి వద్దకు వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలని, అందుకొరకు గతంలోనే బుట్టలను ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు.ప్లాస్టిక్ నివారణ చర్యలు భాగంగా పంచాయతీలో ప్రతి ఇంటికి ప్లాస్టిక్ స్థానంలో గుడ్డ బ్యాగులు వాడే విధంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే అవి మట్టిలో కలిసిపోవని, అలాగే సంవత్సరాల తరబడి భూమి పొరల్లో ఉండిపోతాయని, తద్వారా పర్యావరణం దెబ్బ తింటుందని అన్నారు.ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఉంటే చెత్త పేరుకుపోయి దోమలు ఈగలు పెరుగుతాయని, దోమల వల్ల మలేరియా డెంగ్యూ లాంటి పలు విష జ్వరాలు, టైఫాయిడ్ కలరా వంటి రోగాలు ప్రబలుతాయని ఎమ్మెల్యే తెలిపారు.ప్లాస్టిక్ నివారణలో భాగంగా అవిలాల పంచాయతీలో ప్రతి ఇంటికి ఉచితంగా చెత్త సేకరానకు అవిలాల పంచాయతీలో గుడ్డ బ్యాగ్గులు ప్రభుత్వం పంపిణీ చేసింది. అనంతరం శ్రీ చక్ర గార్డెన్ లో చెత్త నుండి ఎరువు తయారు చేసిన స్టాళ్ ను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర”కార్యక్రమం పై అవిలాల పంచాయతీ అధికారులు,గ్రామస్థులు , విద్యార్థులచే పులివర్తి నాని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డి పిఓ సుశీలా దేవి, డి.ఎల్.ఓ సురేష్ బాబు,డి ఎల్ డి ఓ జివియల్ నారాయణ, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, ఎ. మధు నాయుడు, వైకుంఠం శ్రీ ధర్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సుభాషిణి, శ్రీనివాసులు, సుధాకర్, శివప్రసాద్, గోపాల్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News