- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్


నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : పెద్ధపూర్ మల్లన్న జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ అన్నారు. శనివారం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ధపూర్ లోని మల్లన స్వామి (పెద్ధపూర్ జాతర) సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతర ఏర్పాట్లను సమీక్షించి ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పార్కింగ్ సౌకర్యాలు, అత్యవసర సేవలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలను పరిశీలించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరా పర్యవేక్షణ, ప్రత్యేక పోలీస్ బృందాలు, శాంతి భద్రతల పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు.భక్తుల భద్రత, సౌకర్యం కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అన్నారు.ప్రతి ఒక్కరు పోలీసుల సూచనలు పాటించి, శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మల్లన స్వామిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డిఎస్పి రాములు
కోరుట్ల సి.ఐ సురేష్,కోరుట్ల ఎస్.ఐ శ్రీకాంత్, మేడిపల్లి ఎస్.ఐ శ్యామ్ రాజ్, కథలాపూర్ ఎస్.ఐ నవీన్ లు పాల్గొన్నారు.





